Thursday, March 11, 2021

ఈ - పంచయత్ కంప్యూటర్ ఆపరేటర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కలవడం జరిగినది

 మిత్రలందరికీ నమస్కారం🙏


ఈ రోజు(10-03-2021) హైదరాబాద్ లో మన పంచాయతీ రాజ్ కమీషనర్ సార్ గారిని ఈ - పంచయత్ కంప్యూటర్ ఆపరేటర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కలవడం జరిగినది గత 7 సంవత్సరాల నుండి 14వ ఆర్థిక సంఘం నిధుల నుండి వేతనాలు అందుకున్నాను, ఇప్పుడు అది పూర్తి అయినందున వేతనాలు అందుకోవడం చాలా ఇబ్బంది జరుగుతున్నది.  కావున ప్రత్యేక గ్రంటు ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ సమన వేతనము 14 జీ. ఓ ప్రకారము 17,500/- రూ.లు అందించి ఇట్టి వేతనాలు ట్రెజరీ లేదా జిల్లా పంచాయతీ అధికారి ద్వారా అందాలని కొరినాము.
పై విషయాలకు సానుకూలంగా స్పందించిన మన గౌరవ కమిషనర్ గారు అతి తొందరలోనే ఒక గ్రాంటు ద్వారా మీకు వేతనాలు అందేలా అందరికీ సమాన వేతనం అందించుటకు చర్చించి అందిస్తామని తెలియజేశారు.
       ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు గడ్డం శేషాద్రి, రాష్ట్ర ఉపాధ్యక్షులు వడియల రామ శేషు, సూర్యాపేట జిల్లా అధ్యక్షులు బిక్షం, నల్లగొండ జిల్లా అధ్యక్షులు సందీప్, మరియు సైదులు పాల్గొన్నారు.

మన డిటెల్స్ ను DPMs అడిగి కమీషనర్ ఆఫీసుకు పంపించడం జరిగినది

 మిత్రులకు శుభ సాయంత్రం, మన డిటెల్స్ ను DPMs  అడిగి కమీషనర్ ఆఫీసుకు పంపించడం జరిగినది. మరియు మన  ఈ పంచాయతీ ఆపరేట్లకు వేతనాలకు ప్రత్యేకమైన Grant కేటాయింపు ఉంటుందని మరియు అన్ని జిల్లాలకు సమానమైన వేతనములు ఇవ్వాలని నిర్ణయం జరుగుతుందని తెలిసినది. కనుక వీలైనంత త్వరగా మనము కమిషనర్ సార్ ను కలిస్తే బాగుంటుంది.